ఐపీఎల్ 2021: ఫోర్-వార్..గెలిచేదెవరు?

0
116

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో మిగిలిన నాలుగో బెర్త్‌ కోసం డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రేసులోనే ఉన్న రాజస్థాన్‌.. కీలక మ్యాచ్‌లో ముంబై చేతిలో ఘోరాతిఘోరంగా ఓడడంతో నాకౌట్‌ దారులు మూసుకుపోయాయి.

రాజస్థాన్ పై విజయంతో ముంబై 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ బెర్త్‌కు చేరువైంది. అన్నింటికంటే ముఖ్యంగా వారి రన్‌రేట్‌ గణనీయంగా మెరుగుపడింది. మరోవైపు కోల్‌కతా కూడా  12 పాయింట్లతో సమానంగా ఉంది. అయితే ముంబై కంటే నైట్‌రైడర్స్‌కు మెరుగైన రన్‌రేట్‌ ఉండడం ఆ టీమ్‌కు కలసి వచ్చే అంశం.

కాగా, ఇరు జట్లకూ లీగ్‌లో మిగిలిన ఆఖరి మ్యాచ్‌ ఎంతో కీలకం. 14వ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో కోల్‌కతా, సన్‌రైజర్స్‌తో ముంబై తలపడాల్సి ఉంది. ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలంటే ఆయా మ్యాచ్‌ల్లో ముంబై, కోల్‌కతా తప్పక గెలిచి తీరాలి. ఎవరు ఓడితే వారు నాకౌట్‌ అయినట్టే.

ఒకవేళ ఇరుజట్లూ తమ తమ మ్యాచ్‌ల్లో గెలిచినా, ఓడినా మెరుగైన రన్‌రేట్‌ సాధించిన జట్టు ముందంజ వేసే అవకాశం ఉంది. కాగా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే అర్హత సాధించాయి. ఫోర్త్ ప్లేస్ కోసం జరిగే వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.