క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ముంబై వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. ఒక్క బెంగళూరు తప్ప మిగతా అన్ని టీంలు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి.
గతంలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ వేట ప్రారంభించింది ఆర్సీబీ. అయితే ఈసారి ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెసిస్ పేరు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డుప్లెసిస్ ను సారథిగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై మార్చి 12న అధికార ప్రకటన ఉంటుందని ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి. మ్యాక్స్ వెల్, దినేష్ కార్తిక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాక్స్ వెల్ కు కెప్టెన్సీ ఇస్తే అది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తుందని ఆర్సీబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దినేష్ కార్తిక్ కంటే డుప్లెసిస్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కావడం, సీనియర్ ప్లేయర్ కావడంతో.. ఆర్సీబీ డుప్లెసిస్ కే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆర్సీబీ నయా కెప్టెన్ ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. కాగా డుప్లెసిస్ గతేడాది చెన్నై తరపున ఆడగా తాజాగా జరిగిన వేలంలో అతడిని బెంగళూరు దక్కించుకుంది.