IPL 2022: టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2022: TeamIndia senior spinner Interesting comments

0
103

ఐపీఎల్ 2022కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సీజన్​లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇక జనవరిలో జరగబోయే మెగా వేలం పైనే అందరి దృష్టి నెలకొంది.

ఏ జట్టు ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి దిల్లీ తనతో పాటు శ్రేయస్​ను అంటిపెట్టుకునేందుకు సిద్ధంగా లేదని వెల్లడించాడు.

శ్రేయస్​ను ఈసారి దిల్లీ అట్టిపెట్టుకోదు. అలాగే నన్ను కూడా వారు వదిలేయబోతున్నారు. మా స్థానాల్లో ఎవరో ఒకరు వస్తారు. ఒకవేళ నన్ను తీసుకుంటే అది నాకు తెలిసేది కదా అని అశ్విన్ తెలిపాడు. ఇక దిల్లీ అంటిపెట్టుకునే ఆటగాళ్ల విషయానికి వస్తే కెప్టెన్ పంత్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరో ఆటగాడి రేసులో అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్​ ఉన్నారు.