IPL: ఢిల్లీ-కోల్​కతా ఢీ..ఫైనల్ కు వెళ్ళేదెవరు?

IPL: Delhi-Kolkata clash..who will go to the final?

0
81

ఐపీఎల్​-14 రెండో క్వాలిఫయర్​ మ్యాచ్​ బుధవారం జరగనుంది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న దిల్లీ క్యాపిటల్స్​ను ఢీ కొట్టనుంది కోల్​కతా నైట్ రైడర్స్. రాత్రి 7.30 నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఒదిన జట్టు ఇంటి ముఖం పట్టగా గెలిచినా జట్టు ఫైనల్లో చెన్నైతో టైటిల్ పోరులో నిలవనుంది. కాబట్టి విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ ఐపీఎల్‌ సీజన్లో అత్యంత నిలకడగా ఆడి, లీగ్‌ దశలో అత్యధిక విజయాలు సాధించిన జట్టు దిల్లీ క్యాపిటల్స్‌. లీగ్‌లో ఎంతో సమతూకంతో కనిపించిన జట్టు కూడా అదే. రెండు వారాల ముందు వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దిల్లీ తలపడితే విజయం ఎవరిదంటే చాలామంది రిషబ్‌ పంత్‌ జట్టు పేరే చెప్పేవాళ్లేమో. కానీ గత కొన్ని మ్యాచ్‌ల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రదర్శన చూశాక ఇప్పుడు దిల్లీ గెలుపుపై ధీమా కలగడం కష్టమే. తొలి అంచెలో పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ రేసులోనే లేదనుకున్న జట్టు యూఈఏలో రెండో అంచెలో దూకుడుగా ఆడి చివరి 8 మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమైన జట్టు నైట్‌రైడర్స్‌. మరి సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి చెన్నైతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించే జట్టేదో?

లీగ్‌ దశలో తొలి ముఖాముఖి మ్యాచ్‌లో దిల్లీ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచింది. యూఏఈలో రెండో అంచె ఆరంభమైనప్పటి నుంచి కోల్‌కతా రెండోసారి బ్యాటింగ్‌ చేసిన ప్రతిసారీ గెలిచింది. దిల్లీ ఈ సీజన్లో ఓడిన అయిదు మ్యాచ్‌లూ మొదట బ్యాటింగ్‌ చేసినప్పటివే. రెండో క్వాలిఫయర్‌ వేదికైన షార్జాలో ఈ సీజన్లో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టే నెగ్గింది.

బెంగళూరు-కోల్‌కతా మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగిన షార్జా మైదానంలోనే రెండో క్వాలిఫయర్‌ కూడా జరగబోతోంది. ఇక్కడి పిచ్‌పై బ్యాటింగ్‌ అంత తేలిక కాదు. నెమ్మదిగా ఉండే ఈ వికెట్‌పై బంతి బాగా తిరుగుతుంది. కాబట్టి ఇరు జట్లూ స్పిన్నర్లకే పెద్ద పీట వేస్తాయనడంలో సందేహం లేదు.

తుది జట్లు (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్‌: పంత్‌ (కెప్టెన్‌), ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మయర్‌, స్టాయినిస్‌/స్టీవ్‌ స్మిత్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, నార్జ్‌, రబాడ/టామ్‌ కరన్‌, అవేష్‌ ఖాన్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా దినేశ్‌ కార్తీక్‌, షకిబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, మావి, వరుణ్‌ చక్రవర్తి.