ఐపీఎల్ లో 10 సెకన్ల యాడ్ కి ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్

ఐపీఎల్ లో 10 సెకన్ల యాడ్ కి ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్

0
94

క్రికెట్ ద రిచెస్ట్ గేమ్ అనే చెప్పాలి, ఎందుకు అంటే ఆట‌గాళ్ల రెమ్యున‌రేష‌న్ కూడా అలాగే ఉంటుంది, చూసే వారు కూడా కోట్లల్లో ఉంటారు, అందుకే క్రీడాకారుల‌కి ఎండార్స్ మెంట్ స్పాన్స‌ర్ షిప్స్ యాడ్స్ ఇలా చాలా వ‌ర‌కూ కోట్ల‌కు కోట్లు ఆదాయం వ‌స్తుంది, ఇక ఫామ్లో ఉన్న క్రీడాకారుడ‌కి అయితే నాలుగుఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఎండార్స్ మెంట్స్ యాడ్స్ కుద‌రుర్చుకుంటారు.

అయితే ఇప్పుడు ఐపీఎల్ 2020 హంగామా మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ జరగనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.

ఇక ఆట‌గాళ్లు సిద్దం అయ్యారు, ఇక ఈ మ్యాచులు చూసేందుకు ప్రేక్ష‌కుల‌కి అవ‌కాశం ఉండ‌దు, అంద‌రూ ఆన్ లైన్ లేదా టీవీల్లో మాత్ర‌మే చూడాలి, సో ఇక టీవీల్లో వ్యూయ‌ర్ షిప్ ఎంత ఉంటుందో చూడ‌వ‌చ్చు, కోట్లాది మంది లైవ్ చూస్తారు, అందుకే కంపెనీలు కూడా ఈ స‌మ‌యంలో త‌మ యాడ్స్ ఇవ్వాలి అని ఆత్రుత‌గా ఉన్నాయి.

ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్ 10 సెకన్ల యాడ్‌కి రూ.10 లక్షల ధరని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మధ్యలోనే దసరా, దీపావళి కూడా వస్తుండటంతో.. యాడ్స్‌ ఇచ్చేందుకు కంపెనీలు కూడా పోటీపడే అవకాశం ఉంది అని వార్త‌లు వ‌స్తున్నాయి, సో చూడాలి ఈసారి ఏ కంపెనీలు భారీ యాడ్స్ ఇస్తాయో.