IPL: చెన్నైకు షాక్​..స్టార్ ప్లేయర్ దూరం!

0
117

ఐపీఎల్ 2022 ​మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 29న ఫైనల్​ జరగనుంది. ఈసారి కొత్తగా మరో రెండు జట్ల ఎంట్రీతో వినోదం పెరగనుంది. మొత్తం పది జట్లు 15వ సీజన్‌లో పాల్గొననున్నాయి. తాజాగా డిఫెండింగ్​ ఛాంపియన్స్​ చెన్నైసూపర్​ కింగ్స్​కు భారీ దెబ్బ తగిలింది.

కోట్లు కుమ్మరించి కొనుక్కున్న దీపక్​ చాహర్​ గాయంతో దూరమవడం.. ఆ జట్టు కూర్పును క్లిష్టతరం చేసింది. వెస్టిండీస్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో అతడి కుడిభుజానికి గాయమైంది. బ్యాటు, బాల్ తోనూ సత్తా చాటగల అతడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ, అతడు సీజన్​ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్న వేళ.. సీఎస్​కే మరో ముగ్గురిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ కెరీర్​లో చాహర్​ 20 టీ20 ఆడి 26 వికెట్లు పడగొట్టగా.. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్​లోనూ సత్తా చాటిన చాహర్​.. వన్డేల్లో రెండు అర్థశతకాలు సాధించాడు. బౌలర్​ దీపక్​ చాహర్​ గాయం కారణంగా ఐపీఎల్​లో సగం మ్యాచ్​లకు దూరం కానున్నాడు. అప్పటికి గాయం మనకుంటే పూర్తి ఐపీఎల్ కు దూరం కానున్నాడు.