2019 ఎన్నికల్లో నేను పోటీ చెయ్యను

2019 ఎన్నికల్లో నేను పోటీ చెయ్యను

0
123

2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేయనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి నా కుమారుడు అస్మిత్‌రెడ్డి పోటీ చేస్తాడని పేర్కొన్నారు. అయితే… నేనుమాత్రం ఎన్నికల్లో పోటీ చేయోద్దని నిర్ణయించుకున్నానని, ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒత్తిడి తెస్తే మాత్రం పోటీ చేస్తానన్నారు.

అలాగే ఆరోగ్యం సహకరించకపోతే రాజీనామా చేస్తానని జేసీ ప్రకటించారు. కాగా… వనం-మనం కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మితోపాటు పలువురు పాల్గొన్నారు.