ఢీ 10 కి వచ్చినందుకు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఢీ 10 కి వచ్చినందుకు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

0
37

బుల్లితెరపై వచ్చే రియాల్టీ షోలకు సిల్వర్ స్క్రీన్ స్టార్ లు రావడం,అందుకు ప్రతిఫలంగా నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ లు ముట్టజెప్పడం షరా మామూలే. ఇక ఎంతోమంది యువ డాన్సర్లు తమ ప్రతిభను చాటిచెప్పడానికి వేదికగా ఢీ రియాల్టీ షో నిలుస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే 9 షోలు పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రాం 10వ ఎడిషన్ కూడా విజయవంతంగా చివరి దశకు చేరింది. ఇలాంటి ప్రోగ్రాం టాలెంటెడ్ యూత్ కి ఎంతోమేలు చేకూరుస్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈ షో కి ఉన్న క్రేజ్ భారీ లెవెల్లో వుంది. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్,రేష్మి,వర్షిత్,ఆర్ జె. హేమంత్,ప్రియమణి,శేఖర్ మాస్టర్ ఇలా కాకలు తీరిన సెలబ్రిటీలు కొలువైన ఈ డాన్స్ రియాల్టీ షో ఢీ-10 ఎడిషన్ ప్రస్తుతం ఫైనల్ కి వచ్చేయడం, దీనికి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరవ్వడంతో భారీ హైప్ వచ్చింది.

ఇక జై లవకుశ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఇంకా ఏదీ రాకపోవడంతో తమ అభిమాన నటుడు ని బుల్లి తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫాన్స్, ఈ షోలో ఎన్టీఆర్ ని చూసి తెగ ఆనందపడిపోయారు. ఇక ఢీ-10 ప్రోగ్రాం కి ఎన్టీఆర్ రావడానికి వేరే కారణం ఉందట. ఎందుకంటే చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యం అభ్యసించిన ఎన్టీఆర్ కి డాన్స్ అంటే పిచ్చి. డాన్స్ లో పక్కా శిక్షణ పొందిన తారక్, టాలీవుడ్ లోని టాప్ డాన్సర్లలో ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు.

డాన్స్ అంటే ప్రాణం ఇచ్చే ఎన్టీఆర్ కి అందులోని ఆనందంతో పాటు కష్టం తెల్సినవాడే. అందుకే డాన్సర్లంటే అభిమానం గల తారక్ తన చిత్రాల్లో కొత్త డాన్సర్లకు,కొరియోగ్రాఫర్స్ కి ఛాన్స్ లు కల్పిస్తుంటాడు.అయితే ఢీ-10 షో కి డాన్సర్లపై అభిమానంతోనే తారక్ వచ్చాడట. పైగా ఈ ప్రోగ్రాం కి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు ఒక్క రూపాయి కూడా ఛార్జి చేయలేదట.

మాములుగా అయితే బాలీవుడ్ లో సల్మాన్, మాధురి తదితరులు ఇలాంటి షోలకు వస్తే కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటిది,డాన్సర్లలో కనిపించే ఆనందమే తనకు వెయ్యి రెట్ల రెమ్యుననరేషన్ తో సమానమని తారక్ చెప్పడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.