నాకు అదంటే వణుకు వస్తుంది – జూనియర్ ఎన్టీఆర్

నాకు అదంటే వణుకు వస్తుంది - జూనియర్ ఎన్టీఆర్

0
104
NTR

హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌ల జాబితాలోకి చేరిపోయారు. శుక్రవారం సాయంత్రం.. సెలెక్ట్ మొబైల్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు.

1. ఫోన్ వాడటం ఎప్పుడు ప్రారంభించారు?
ఎన్టీఆర్: నేను ఇంటర్ మీడియట్ చదివే రోజుల్లో.. జగదీశ్ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ ఆల్కాటెల్ కొన్నాను.

2 ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా?
ఎన్టీఆర్: ప్రపంచం మారిపోయింది. ఏమీ లేకున్నా సరదాగా ఫోన్ తీసి చూస్తున్నాం.. నేను కూడా అంతే. నేను అసలు ఫొటోలే దిగను. నాకు పోజ్ ఇవ్వడం నచ్చదు. అదంటే నాకు వణుకు వస్తుంది. నా భార్య కూడా నా ఫొటోలు తీస్తానని అంటుంది. కానీ, నాకేమో పోజులివ్వడం రాదు.

3: మొబైల్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు?
ఎన్టీఆర్: చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా అలా లేను.. ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యమం.. ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఎవరితోనైనా మాట్లాడటానికైనా ఫోన్ కావాల్సిందే. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫోన్ లేకుండా ఉన్నాను అని జూనియర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.