జనసేనకి రెండు న్యూస్ చానెల్స్

జనసేనకి రెండు న్యూస్ చానెల్స్

0
107
Pawan Kalyan Jana Sena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ఛానల్ ఉండాలని ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఛానల్స్ తో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అందుకు తన కార్యక్రమాలు ఏ ఛానల్ ప్రసారం చేయకపోవటంతో అప్పటికే సామజిక మీడియా కోసం ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్న పవన్ తనకు ఛానెల్ కావాలని నిర్ణయించుకొన్నారు. అందుకే సిపిఐ కి అనుబంధంగా ఉన్న ’99’ ఛానెల్ ను జనసేన నేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈయన మాజీ ఐ ఏ ఎస్ అధికారి. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసేందుకు తన పదవికి చేసి రాజకీయాల్లోకి వచ్చాడు.

2009 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రె పార్టీలో చేరిన అయన గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు చేతిలో ఓడిపోయారు. ఎంపీగా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ పారిశ్రామిక వేత్తగా మాత్రం అయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. హైద్రాబాద్ లో టాప్ కంపెనీల్లో ఒకటైన ఆదిత్య గ్రూప్ కంపెనీ అధినేతల్లో తోట చంద్రశేఖర్ ఒకరు కావడం విశేషము. అయితే పవన్ కళలు కంటున్నా న్యూస్ ఛానల్స్ తాజాగా తోట చంద్రశేఖర్ కైవసం చేసుకొన్నారు.

ఇక నుంచి 99 టివి లో పూర్తిగా జనసేన వాయిస్ నిపించనుంది. అయితే ఈ ఛానల్ తో పాటుగా మరో ఛానల్ కూడ త్వరలో జనసేన వాయిస్ వినింపించేందుకు ముస్తాబవుతున్నట్లు సమాచారం. సిపిఐ బాటలోనే సిపిఎం కూడా తన 10 టీవీ ని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్న 10 టీవీ కూడా పవన్ కు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఎం పార్టీ పబ్లిక్ షేర్లతో స్థాపించిన 10 టీవీ త్వరలో కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. ఆగష్టు 1 నుండి మరో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో 10 టీవీ కార్యక్రమాలు పునఃప్రారంభo కానున్నట్టు సమాచారం. దీని వెనకాల చిరంజీవి కూడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జనసేన నుంచి పోటీ చేస్తానే ప్రచారం జరుగుతున్నందున ఇక అతి త్వరలోనే 10 టివి కూడ జనసేన గళాన్ని వినిపించేందుకు సిద్దమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

పవన్ కు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో మా టివి యాజమాన్యంలో భాగస్వాముడిగా ఉన్నారు. అనంతరం మా టివి నుండి యాజమాన్యం మారడంతో ప్రస్తుతం స్టార్ మా టీవీ గా మారింది. 99, 10 టివి లు జనసేన గెలుపు కోసం ఇక పనిచేయనున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఇటు అధికారికంగా 99 తో పాటు 10 టీవీలు జనసేన గెలుపు కోసం పనిచేయనున్నాయి. ఎట్టకేలకు కావాలనుకున్న మీడియా ఛానల్స్ ఇపుడు పవన్ చేతిలో ఉన్నాయి.

ఏది ఏమైనా ఇక జనసేన తన సొంత ఛానెల్ ’99’ తో పాటు 10 టీవీ కూడ రాబోయే ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం నుండి ఛానెల్ వరకు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. ముందుకు వెళ్తున్నారు. గెలుపోటములు పక్కన పెడితే ఒక స్టార్ హీరో పూర్తి స్థాయి రాజకీయనాయకుడు అయిపోయినట్టున్నాడు. ఇక ఈ రెండు ఛానళ్ల విస్తృత ప్రచారంతో రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోనున్నారు. అయితే ఈ ఛానెల్స్ అన్ని సొంత డబ్బా కొట్టుకోడానికి తప్ప రాజకీయాలను నేటి రోజులలో ప్రభావితం చేయబోవని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సొంత ఛానెల్ ఉన్నవారంతా ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు కాలేరని ఇప్పటికే పలు ఛానెళ్లు నిరూపిస్తూనే ఉన్నాయి.
Attachments area