ఆ రోజే మహేష్ బాబు 25 వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

ఆ రోజే మహేష్ బాబు 25 వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

0
43

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తన ఇరవై ఐదవ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ రాబోతోంది. అభిమానులకు మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ రాబోతోంది. వచ్చేనెల 9న మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ 25వ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం.

మహేష్ కు ఇది ఇరవై ఐదవ చిత్రం కావటం,అలాగే దీనికి ముందు చిత్రం ఘన విజయం సాధించటంతో ప్రస్తుత చిత్రంపై కూడా అంతే భారీ అంచనాలు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రంలో మహేష్ కాలేజీ విద్యార్థిగా రైతుల కోసం పోరాడే యువకునిగా…తన పాత్రను పోషించనున్నారట. ఇక మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రం కోసం రాజసం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బిజినెస్ మాన్ చిత్రం విజయం తరువాత అదే పంధాలో చిత్రాలు తీస్తూ రావటంతో ఈ చిత్రం లో కూడా సమాజంలో ఓ సమస్య పై హీరో పోరాడే అంశాన్నే ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రిగా మీసాలతో కనపడిన మహేష్, ఈ సారి స్టూడెంట్ గా అది మీసాలు, గడ్డంతో నేటి యువతకు కొత్త ట్రెండ్ ను రుచి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా ఫోటోలు నెట్ లో కూడా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.