ఈ మాయ పేరేమిటో సినిమా పాటల వేడుకకు జూ.ఎన్టీఆర్

ఈ మాయ పేరేమిటో సినిమా పాటల వేడుకకు జూ.ఎన్టీఆర్

0
114

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఈయ‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం “ఈ మాయ పేరేమిటో”. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లుక్ ను వరుణ్ తేజ్ తో, హీరో హీరోయిన్ పోస్టర్ ను సాయి ధరమ్ తేజ్ తో విడుదల చేయించారు. తాజాగా జూలై 28న జరిగే ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా “ఈ మాయ పేరేమిటో” ఆడియోను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రామాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.

రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్‌: విజయ్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమ‌ణి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: శామ్ కె.నాయుడు, నిర్మాత‌: దివ్యా విజ‌య్‌, ద‌ర్శ‌క‌త్వం: రాము కొప్పుల.