ఇక పై అలాంటివి చేయనంటున్న కాజల్ అగర్వాల్

ఇక పై అలాంటివి చేయనంటున్న కాజల్ అగర్వాల్

0
62

ఇక పై ఐటెం సాంగ్స్‌కు నో అంటోందట టాలీవుడ్ చందమామ కాజల్. ఎన్టీఆర్ కోరిక మేరకు జనతా గ్యారేజ్‌లో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన కాజల్‌కు ఆ తరువాత అలాంటి ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ వాటికి నో చెబుతూ వచ్చిన కాజల్.. తాజాగా కూడా మరో ఐటెం సాంగ్‌కు నో చెప్పిందట. టాలీవుడ్‌ సమాచారం ప్రకారం.. ఇటీవల ఓ టాప్ డైరక్టర్ కాజల్‌ను తన సినిమాలో ఓ ఐటెంసాంగ్‌లో చేయమని అడిగారట. అందుకుగానూ భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశారట.

అయితే ప్రత్యేక పాత్రలో చేస్తాను తప్ప, ప్రత్యేక గీతంలో నటించనని ఖరాఖండిగా చెప్పేసిందట కాజల్. దీంతో ఆ దర్శకుడు మరో హీరోయిన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కాజల్ పారిస్ పారిస్ చిత్రంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండు సినిమాలలో, రవితేజ సరసన ఓ చిత్రంలో నటించనుంది. వీటితో పాటు ఓ పంజాబ్ చిత్రంలో కాజల్ నటించనున్నట్లు తెలుస్తోంది