ముదిరిన కెప్టెన్సీ వివాదం..విరాట్ కోహ్లీపై కపిల్‌దేవ్‌ సంచలన వాఖ్యలు

Kapil Dev's sensational remarks on Virat Kohli

0
116

బీసీసీఐని ఉద్దేశించి టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తున్నట్టు బీసీసీఐ తనకు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అంతేకాదు టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందిస్తూ…కోహ్లీ అలా మాడ్లాడి ఉండకూడదని వ్యాఖ్యానించింది. కోహ్లీతో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడారని తెలిపింది. బీసీసీఐ వివరణతో విషయం మరింత గందరగోళంగా మారింది. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.

కోహ్లీ ఆడినంతగా క్రికెట్ సెలెక్టర్లు ఆడి ఉండకపోవచ్చని కానీ కెప్టెన్సీని నిర్ణయించే సంపూర్ణ అధికారం సెలెక్టర్లకు ఉంటుందని కపిల్ పేర్కొన్నారు. కెప్టెన్సీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలను సెలెక్టర్లు కోహ్లీకే కాదు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయం కోహ్లీకే కాకుండా అందరు ఆటగాళ్లకు వర్తిస్తుందని చెప్పారు.

తాజాగా ఈ వ్యవహారంపై లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నోరు విప్పాలని అన్నారు. అప్పుడే వివాదంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు ఎలా వచ్చాయో చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

నాకు తెలిసి కోహ్లీ వ్యాఖ్యల్లో బీసీసీఐ ప్రస్తావన లేదు. కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నారన్న మెసేజ్ ఇచ్చిన వారినే ఆ విషయం గురించి అడగాలి. అవును, కచ్చితంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీనే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకీ వివాదం తలెత్తిందో వెల్లడించాలి అని పేర్కొన్నారు.