కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చాడు..హనుమంతరావు 

0
108

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాడు. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని..తాగుబోతుల తెలంగాణగా మార్చాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసాడు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరగడానికి కారణం కెసిఆర్ అని తెలిపాడు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రజలను తాగుబోతులను చేసి సొమ్ము దోచుకుంటూ పర్మిట్ రూమ్ లంటూ బార్ షాపుల తయారు చేశారు. సమాజం మద్యం సేవించి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడంతో పాటు..మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. ఒకే బస్తీలో మూడు , నాలుగు బార్ , వైన్ షాపులు తెరవడంతో తాగిన మైకంలో ఏం చేస్తున్నారో అర్థం కావడం  లేదు. దీంతో ప్రతిక్షణం ఆడపిల్ల భయపడుతూ బతికే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలపై మహిళలు వ్యతిరేకంగా పోరాడుతూ ధర్నా చేయాలనీ అన్నారు.

రాష్ట్రంలో స్కూల్ లను మూసేసి ప్రభుత్వం విస్కీ‌, వైన్ అమ్మకాలను నడిపిస్తూ ఒక్కొక్క ఊళ్లో రెండు బెల్ట్ షాపు లు తెరిపించారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేస్తూ మహిళల తరుపున నేను పోరాటం చేస్తా అని అన్నారు. రాష్ట్రంలో వైన్ షాప్ లు మూసివేయకపోతే ఓట్లు వేయమని గట్టిగ వాదించారు. సమాజాన్ని మంచి బాటలో నడిపించేందుకు రాహుల్ గాంధీ, రేవంత్ తో ఆలోచన చేసి మధ్యపాన నిషేధంపై త్వరలోనే  నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.