టాప్ హీరో ప్రేమలో మహేష్ బాబు హీరోయిన్ ?

టాప్ హీరో ప్రేమలో మహేష్ బాబు హీరోయిన్ ?

0
108

తెలుగు లో తన తొలి సినిమా మహేష్ బాబు తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కైరా ఆడ్వాణీ. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా `ల‌స్ట్ స్టోరీస్‌` వెబ్ సిరీస్‌తో పాపుల‌ర్ అయిపోయింది. ఆ వెబ్ సిరీస్‌లో కైరా బోల్డ్ సీన్స్‌లో న‌టించి మెప్పించింది. తాజాగా ఈ హీరోయిన్ ఒక బాలీవుడ్ హీరోతో ప్రేమాయణాన్ని నడిపిస్తోందా? అనే వార్త‌లు వ‌స్తున్నాయి అసలు కథ ఏమిటో కానీ, ఈ మేరకు ప్రచారం అయితే సాగుతోంది.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కైరా అద్వానీ ప్రేమలో పడిందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, వీరిద్దరి మధ్యన సమ్‌థింగ్, సమ్‌థింగ్ అని ప్రచారం జరుగుతోంది. ఆలియా భ‌ట్‌తో బ్రేక‌ప్ అనంత‌రం శ్రీలంక సుంద‌రి జాక్వెలిన్‌తో స‌న్నిహితంగా మెలిగిన‌ సిద్ధార్థ్‌.. తాజాగా కైరా కు ద‌గ్గ‌రైన‌ట్టు స‌మాచారం. సిద్ధార్థ్‌, కైరా లు త‌ర‌చుగా బ‌య‌ట క‌నిపిస్తుండ‌డ‌మే ఆ గాసిప్‌కు కార‌ణం.అంతేకాదు తాజాగా జ‌రిగిన కైరా బ‌ర్త్‌డే పార్టీకి కూడా సిద్ధార్థ్ హాజ‌ర‌య్యాడ‌ట‌. కైరా బర్త్ డే పార్టీకి చాలా మందే వచ్చినా సిద్ధార్థ్ మల్హోత్రా రావడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో వీరి ప్రేమాయ‌ణం గురించి హాట్ హాట్ డిస్క‌ష‌న్లు జ‌రుగుతున్నాయి. కైరా కెరీర్‌ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తొలిసారి ఆమె విషయంలో ప్రేమ అనే గాసిప్స్ వస్తున్నాయి.