మహేంద్ర సింగ్ ధోనీ విజయాలు అందించిన ఓగొప్ప కెప్టెన్, ఎన్నో విజయాలు భారత్ కు ఇచ్చిన గొప్ప క్రీడాకారుడు, అయితే తాజాగా ఐపీఎల్ లో చెన్నై టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు, అయితే ధోనీతాజాగా ఈ ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆ రికార్డు ఏమిటో చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు ఎంఎస్ ధోనీ. ఇప్పటి వరకూ రెండు వందల ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు, అయితే ఈ రికార్డు ఇక వచ్చే సీజన్ లో ఎవరైనా దాటాల్సి ఉంటుంది.
అయితే సురేష్ రైనా ఈ ఘనత సాధించే అవకాశం ఉంది, కాని అతను లీగ్ నుంచి వెళ్లిపోవంతో ఇది మిస్ అయ్యాడు. ఈలీగ్ మ్యాచ్ లు సురేష్ రైనా ఆడి ఉంటే ముందు రైనా ఈ ఘనత సాధించేవాడు, ఇప్పటికే సురేష్ రైనా ఐపీఎల్ లో 193 మ్యాచ్‌లాడాడు. ఈ సీజన్‌లో సీఎస్కే 7వ మ్యాచ్ రైనాకు 200వ మ్యాచ్ అయ్యేది.
మరి అత్యధిక మ్యాచ్ లు ఎవరు ఆడేరు అనేది చూస్తే వరుసగా
1.ధోనీ 200 మ్యాచ్ లు ఆడారు
2.రోహిత్ శర్మ 197 మ్యాచ్ లు ఫినిష్ చేశాడు
3..సురేష్ రైనా 193మ్యాచ్ లు ఆడారు
4. విరాట్ కోహ్లీ 186 మ్యాచ్ లు ఫినిష్ చేశారు.