మరో క్రికెటర్ గుడ్ బై షాక్ లో అభిమానులు

మరో క్రికెటర్ గుడ్ బై షాక్ లో అభిమానులు

0
92

క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సౌత్ ఆఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్, ఆటతో తనకంటూ ప్రత్యక గుర్తింపు సంపాదించిన ఈ పేసర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు… కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత అతడు కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్) ట్వీట్ చేసింది. దీంతో అతని అభిమానులు అందరూ షాక్ అయ్యారు.

ఇంత తొందరగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అని షాక్ అయ్యారు, అయితే ఆయన పై గత రెండు నెలలుగా ఇదే వార్తలు వినిపించాయి.. అక్కడ మీడియాలలో, తాజాగా ఆయన తన నిర్ణయం ఫైనల్ చేశారు…సఫారీ పేస్ దళంలో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్తోపాటు ఫిలాండర్ కూడా కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ ఫార్మాట్లో దక్షిణాఫ్రికాకు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించిన 34 ఏళ్ల ఫిలాండర్ 60 టెస్ట్లు, 30 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. అన్నీ మ్యాచుల్లో అట్ మోస్ట్ తన ఆటతో అందరికి ఆకట్టుకున్నాడు.

పేసర్ గా టాప్ గా టీమ్ లో నిలిచాడు. ఇప్పటి వరకూ ఆడిన టెస్ట్ల్లో 216 వికెట్లు పడగొట్టాడు. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ లో తాము ఇంగ్లండ్ను ఓడిస్తే తనకు మంచి వీడ్కోలు లభించినట్టు భావిస్తానని ఫిలాండర్ అన్నాడు. సో ఇంగ్లండ్ పై ఈసారి టీమ్ కసిగా గేమ్ ఆడనుంది అనేది తెలుస్తోంది.