తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది

తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది

0
88

నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణంపై ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ‘నేను ఇండియాలో లేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను.అందుకే రాలేకపోయాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ.

తమ సొంత బ్యానర్‌లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ రోజు మొదలైన మా అనుబంధం ఈ నాటికి కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. కాగా మోహన్ బాబు, హరికృష్ణ …శ్రీరాములయ్య చిత్రంలో కలిసి నటించారు.