ప్రతిష్టాత్మక టోర్నీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు 2021-22 సీజన్ కోసం బీసీసీఐ రంగం సిద్ధం చేసింది . అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది ముంబయి.
భారత ఆటగాడు పృథ్వీ షా ఈ టీమ్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, ఆదిత్య తారే, శివమ్ దూబేవంటి మెరుగైన ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ ముంబయి రంజీ జట్టులో చోటు సంపాదించాడు.
అర్జున్ నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కొంతకాలం గాయం కారణంగా ఇబ్బందిపడిన అతడు ప్రస్తుతం మంచి లయలో ఉన్నాడు” అని ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సలీల్ అంకోలా చెప్పాడు. అర్జున్ నిరుడు ముంబయి సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడాడు. అలాగే రంజీ ట్రోఫీలో నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. యూపీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కరుణ్ శర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.