Flash: భారత్‌- ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్‌ రద్దు

0
81

భారత్‌, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత్‌ 15.2 ఓవర్లలో 134/4 పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.

దీంతో మ్యాచ్‌ను తాత్కాలింగా నిలిపివేశారు. తరువాత దాదాపు  గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్‌..వర్షం ఎప్పటికీ ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా భారత్‌కు ఓపెనర్లు షఫాలి వర్మ(17), స్మృతి మంధన(18) శుభారంభాన్ని ఇచ్చారు.

జెమిమా రోడ్రిగ్స్ 49 పరుగులచేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డనర్ రెండు వికెట్లు పడగొట్టగా సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహామ్ చెరో వికెట్‌ సాధించారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. కొద్దిరోజుల క్రితమే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే.