ఒక్కసారిగా శృతి పై నిప్పులు చెరిగిన నెటిజన్లు

ఒక్కసారిగా శృతి పై నిప్పులు చెరిగిన నెటిజన్లు

0
115

తమిళ ఆరాధ్య దైవం కరుణానిధి మరణించి తమిళనాడంతా శోకసంద్రంలో ఉంటే ఆ నాయకుడికి నివాళులు అర్పించకుండా సంతాపం తెలియజేయకుండా నేను లండన్ వెళ్లానని అక్కడ ఓ ఆల్బమ్ చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా ఓ ఫోటో ని సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా శృతి పై నిప్పులు చెరిగారు నెటిజన్లు . ఒకవైపు యావత్ భారతం కరుణానిధి కి సంతాపం తెలియజేస్తుంటే ఈమె మాత్రం ఏమి ఎరుగనట్లు ఏదో విషయాన్నీ ట్వీట్ చేయడం ఏంటి ? అంటూ మండిపడుతున్నారు .

గతకొంత కాలంగా శృతి హాసన్ కు సరైన సినిమాలు లేకుండా పోయాయి దాంతో ప్రియుడి తో కాలక్షేపం చేస్తోంది . ముంబై లో ఎంజాయ్ చేస్టున్న ఈ భామ తాజాగా ఓ ఆల్బమ్ కోసం లండన్ వెళ్లిందట . హాయిగా సినిమాలు వస్తుంటే చేసుకోకుండా కొంచెం గోరోజనం చూపించడంతో ఇప్పుడు సినిమాలు లేకుండా పోయాయి ఈ భామకు . అదే బాధ అని ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే ఇప్పుడు శృతి ని టార్గెట్ చేయడంతో ఆమె కన్నా శృతి హాసన్ ఫ్యాన్స్ కే ఎక్కువ బాధ .