శ్రీనివాస కళ్యాణం మూవీ రివ్యూ

శ్రీనివాస కళ్యాణం మూవీ రివ్యూ

0
36

చిత్రం:శ్రీనివాస కళ్యాణం

నటీనటులు: నితిన్ – రాశి ఖన్నా – ప్రకాష్ రాజ్ – జయసుధ – రాజేంద్ర ప్రసాద్ – సితార – ఆమని – జయసుధ – నందిత శ్వేత – పూనమ్ కౌర్ – నరేష్ – ప్రవీణ్ – విద్యుల్లేఖ – సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: రాజు – శిరీష్
రచన – దర్శకత్వం: సతీశ్ వేగేశ్న

కథ :
వాసు (నితిన్), చండిఘర్ లో డిజైనర్ గా పనిచేస్తూ అక్కడ తెలుగు వాళ్లతో కలిసి ఉంటాడు.. తన ఇంటి పక్కనే దిగిన హీరోయిన్ ను చూసి తోలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె కూడా కుటుంబం దాని విలువల గురించి వాసుకి ఉన్న అండర్ స్టాండింగ్ తో అతనికి దగ్గరవుతుంది. బిలీనియర్ ఆర్కే (ప్రకాశ్ రాజ్) కూతురు అయిన హీరోయిన్ వాసుతో పెళ్లికి ఎలా ఒప్పించింది, వీరి ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో కుటుంబసభ్యులు ఎవరెవరు ఎలా పాల్గొన్నారు అన్నది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ బాంధ‌వ్యాలను, బంధువుల మధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూ సినిమాను చాలా ప్లెజెంట్‌గా తీశారు. ముఖ్యంగా పెళ్లి గురుంచి చాలా గొప్ప‌గా చూపించారు.

హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంప్రదాయాలకు విలువ ఇచ్చే ‘శ్రీ’ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే ప‌ద్మావ‌తి పాత్రలో కనిపించిన మరో హీరోయిన్ నందితా శ్వేత ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. లోపల చిన్న అసూయతో, ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.

కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, జయసుధ, ఆమని, సితార ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు.

దర్శకుడు సతీష్ వేగేశ్న బరువైన సన్నివేశాలని కూడా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో చాలా విశ్లేషాత్మకంగా చూపించినందుకు ఆయన్ని అభినందించి తీరాలి.

మైనస్ పాయింట్స్ :

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడిపారు.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. అలాగే పద్మావతిగా మంచి భావేద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కూడా సరైన ముగింపు వుండదు.

ఓవరాల్ గా శ్రీనివాస కల్యాణంలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ని అంతే బలంగా ఎలివేట్ చేసే కాన్ ఫ్లిక్ట్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి.

నటీనటుల ప్రతిభ :

వాసు పాత్రలో నితిన్ చాలా చక్కగా నటించాడు. ఇక రాశి ఖన్నా పాత్ర చాలా బాగుంది. చాలారోజుల తర్వాత నితిన్ లో మంచి ఎనర్జీ కనబడింది. ఈ సినిమాలో చిన్న పాత్రకు కూడా భారీ స్టార్ట్ కాస్టింగ్ తీసుకున్నారు. ప్రతి పాత్ర సినిమాలో చాలా బాగుంటుంది. జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్ ఇలా అందరు తమ తమ పాత్రల్లో అలరించారు.

రేటింగ్ – 2.75

చివరిగా – కుటుంబం మెచ్చిన చిత్రం