మెగాస్టార్ 152 వ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

మెగాస్టార్ 152 వ సినిమాకి హీరోయిన్ ఫిక్స్

0
95

భాగమతి తో సక్సెస్‌ సాధించిన స్వీటీ అనుష్క ఇప్పుడు బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. మరో పక్క స్క్రిప్ట్స్‌ వింటూ బిజీగా ఉంటుంది. అయితే స్క్రిప్ట్స్‌ ఎంపికలో అనుష్క పర్టికులర్‌గా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం అగ్ర కథానాయకుడు చిరంజీవి సరసన హీరోయిన్‌గా అనుష్క నటించనుంది. వివరాల్లోకెళ్తే… ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే తదుపరి సినిమా స్టార్ట్‌ చేసేస్తారు. కొరటాల శివ.. చిరంజీవి కోసం ఓ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ కథను సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా ప్రారంభం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సినిమా నిర్మితం కానుంది.