నిఖిల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నిఖిల్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

0
116

వరుసగా రెండు ఫ్లాప్‌లు చూసి డీలాప‌డ్డ నిఖిల్ ఇపుడు జ‌ర్న‌లిస్ట్‌గా మారాడు. ఒక త‌మిళ సినిమా ఆధారంగా రూపొందుతోన్న “ముద్ర” సినిమాలో న‌టిస్తున్నాడు. ఇంత‌కుముందు ఒక క‌న్న‌డ సినిమా రీమేక్‌తో అప‌జ‌యం పొందాడు. కానీ ఈ సారి క‌థ బాగుందంటున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. దీపావళి సందర్భంగా నవంబర్ 8న రిలీజ్ అవుతుంద‌ట‌.

ఈ సినిమాలో లావణ్య తిపాఠీ న‌టిస్తోంది. నిఖిల్‌తో లావ‌ణ్య న‌టించ‌డం ఇదే ఫ‌స్ట్‌టైమ్‌.ఈ సినిమా ఆడ‌క‌పోతే నిఖిల్ రేసులో చాలా వెన‌క‌బ‌డుతాడు. అందుకే ఈ మధ్య త‌న సోష‌ల్ మీడియాలో ఇమేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రీసెంట్‌గా ష‌ర్ట్ విప్పేసి స‌ల్మాన్‌ఖాన్ టైప్‌లో ఫోజు ఇచ్చి ఆ ఫోటోని షేర్ చేశాడు. అమ్మాయిల్లో ఇమేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం అన్న‌మాట‌.