సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ హీరో కూతురు

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ హీరో కూతురు

0
62

ఇప్పటికే అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్‌ఖాన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలీవుడ్ కథానాయుకుడు షారూక్ ఖాన్. ఆయన ఫ్యామిలీ నుండి తర్వాత తరం నుండి సినీ వారసులు ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ముందుగా షారూక్ తనయ సుహానా ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

రీసెంట్‌గా ఓ ప్రైవేట్ మాగజైన్‌కు సుహానా ఇచ్చిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దీంతో బాలీవుడ్‌కు చెందిన సంజయ్ లీలా బన్సాలీ, సుజోయ్ ఘోష్ వంటి వారు సుహానాను బాలీవుడ్‌కు పరిచయం చేస్తామని ముందుకు వచ్చారు.

మరో వైపు షారూక్ స్నేహితుడు కరణ్ జోహార్ కూడా సుహానాని ఇండస్ట్రీకి పరిచయం చేయుడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సుహానా చదువు పూర్తి చేయాలని షారూక్ దంపతులు కోరుకుంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే సుహానా బాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని సమాచారం.