గొప్ప మనసు చాటుకున్న ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి.. కరోనా నేపథ్యంలో జీతాల పెంపు..!!

-

మొదటి దశ కరోనా నేపథ్యంలో ఇప్పటికీ కోలుకోలేదు దేశ ఆర్థిక పరిస్థితి.. ఈలోగానే రెండో వేవ్ అంటూ మళ్ళీ ప్రజలను కష్టాలను పెట్టడానికి వచ్చేస్తుంది మహమ్మారి..దీని దెబ్బకు ప్రతి రంగం కుదేలైపోయింది.. ముఖ్యంగా మీడియా రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.అకస్మాత్తుగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రతి సంస్థ తమ ఉద్యోగులను తప్పని పరిస్థితుల్లో తీసేస్తుంటే మరి కొన్ని సంస్థలు ఉద్యోగులకు సగం జీతాలే చెల్లిస్తూ బలవంతంగా వారిని కంటిన్యూ చేస్తుంది. ఇంతటి కష్టసమయంలో జీతాలే సరిగ్గా ఇవ్వలేని స్థితిలో సైతం ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి తన గొప్ప మనసుని చాటుకున్నాడని కొన్ని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది.. తన వద్ద పనిచేసే ఎంప్లాయ్ ల కష్టాలు తన కష్టాలుగా భావించి అయన వారి జీతాలను పెంచబోతున్నారట.

- Advertisement -

జర్నలిజం విలువలను పెంచే విధంగా అయన పాటించే పద్ధతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిజాన్ని నిర్భయంగా చెప్పే గొప్ప వ్యక్తిగా అయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారు. దారి తప్పుతున్న ఈ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే మార్గదర్శిగా ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆయన చేపట్టిన ఈ మహోత్తర కార్యక్రమానికి జర్నలిస్ట్ లోకమంతా హ్యాట్సాఫ్ చెప్తుంది. ఎన్ని విమర్శలొచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చిన చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతూ దిగ్గజ మీడియా అధినేతల వరుసలో ముందు నిలిచారు.

మానవత్వాన్ని విశ్వసించే నరేంద్ర చౌదరి మరొకసారి తన గొప్పతనాన్ని ఈ విధంగా చాటి చెప్పబోతున్నారు. జీతాలలో సహేతుకమైన పెంపు ఇవ్వడం ద్వారా మరియు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా, ఎక్కువ మంది సిబ్బందిని చేర్చే చర్యలను తీసుకోవడం ద్వారా తన సిబ్బంది పట్ల తన నిబద్ధతను నిరూపించారు. ఎన్టీవీ లో పనిచేయడమంటే గొప్ప విషయమనేంత గా ఎదిగిన ఈ సంస్థ ముందు ముందు మరింత అభివృద్ధి చెందుతూ , ఎన్నో శిఖరాలను అవరోహించాలని కోరుకుంటున్నారు సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...