టీడీపీ తో కటీఫ్ చెప్పిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్….ఆ పార్టీపై , టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాలుగేళ్లు సావాసం చేసిన తర్వాత….టీడీపీ నేతలపై పవన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలకు టీడీపీ నేతలు దీటుగా బదులిస్తూ పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు.
టీడీపీ పక్కనే ఉంటూ పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న పవన్….ఇపుడు తమను విమర్శించడంపై మండిపడ్డారు. టీడీపీకి వ్యతిరేకంగా పవన్ మాట్లాడి….. ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైసీపీలకు తోడుగా…ఇపుడు జనసేన నుంచి పవన్ కూడా చంద్రబాబును విమర్శించేందుకు వచ్చారన్నారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న శ్రీరామ్ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై శ్రీరామ్ ప్రశంసల జల్లు కురిపించారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న ఘనత చంద్రబాబుదని శ్రీరామ్ అన్నారు. ఏదో విధంగా ఏపీని డెవలప్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని, కానీ, దానిని అడ్డుకునేందుకు బీజేపీ, వైసీపీ, జనసేనలు అడ్డుపడుతున్నాయని చెప్పారు. బీజేపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, జిల్లాల పర్యటనల్లో వారికి ఎదురైన చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనమన్నారు.
చెప్పులు , ప్లకార్డులతో జనం బీజేపీ నేతలకు స్వాగతం పలుకుతున్నారని…ఏపీ రాజకీయాలను బీజేపీ అర్థః చేసుకోవడంలేదని అన్నారు. ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలు …తెలుగోళ్లను ఎక్కువ కదిలించకూడదని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో అడుగుపెడితే పీఎం 12 రోజులు కుర్చీలో కూర్చోలేని పరిస్థితి ఉందన్నారు. కర్ణాటకలో ….తెలుగోడు చంద్రబాబు అడుగుపెట్టగానే బీజేపీకి ఓట్లు పడలేదని, ప్రభుత్వం ఏర్పాటు కాలేదని చెప్పారు. ఇంకో అడుగు వేస్తే….బీజేపీకి కష్టం. ఆంధ్రోళ్ల సమస్యలు బీజేపీకి అర్ధం కాలేదు….చేసుకోవాలి.