కల్యాణ బాబాయ్ మా అల్లర్ని బాగా ఎంకరేజ్‌ చేశారు

కల్యాణ బాబాయ్ మా అల్లర్ని బాగా ఎంకరేజ్‌ చేశారు

0
67

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా డాటర్స్‌ సుస్మిత, శ్రీజలతో ప్రముక టీవీ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ ఇంటర్వ్యూని చేసింది.ఈ ఇంటర్వ్యూలో సుస్మిత, శ్రీజలు తమ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. మేము ముగ్గురం మాలో మా చెల్లి శ్రీజ వెరీ వెరీ గుడ్ చాల కామ్ గా ఉండేది ఓ పక్కన కూర్చునేది. ఇంకా తమ్ముడు రామ్ చరణ్ నేను అప్పుడు అప్పుడు కొట్టుకునేవాళ్ళం. మా కల్యాణ బాబాయ్ మాత్రం మా అల్లర్ని బాగా ఎంకరేజ్‌ చేసేవారు.

ముఖ్యంగా నాకు చరణ్ కి ఏదో ఒకటి చెప్పి మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవారు. మాతో కలిసి అల్లరి చేసేవారు. సగం గొడవలు ఆయన వల్లే జరిగేవి. ఇంట్లో ఆయనకు మా గొడవలు ఫన్‌ అన్నమాట! శ్రీజ అయితే చాలా సైలెంట్‌. మా ముగ్గురిలో తనే మోస్ట్‌ క్వాలిఫైడ్‌. బాగా చదువుకుంది’’ అని సుస్మిత తెలిపింది.

శ్రీజ మాట్లాడుతూ ఓ పక్క అక్క, అన్నయ్య గొడవలు పడుతుంటే… నాకు ఏ సంబంధం లేనట్టు కూర్చునేదాన్ని. ఎవరికీ సపోర్ట్‌ చేసేదాన్ని కాదు. అందులోనూ ఇంట్లో నేనే చిన్నపిల్లను కదా! అందరూ నన్ను ముద్దు చేసేవారు. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గ్రాడ్యుయేషన్‌ చేశాక… లండన్‌ వెళ్లి మాస్టర్స్‌ చేశా.

ఒక టైమ్‌లో స్పోర్ట్స్‌ ఎక్కువ ఆడేదాన్ని, బాడ్మింటన్‌ నేషనల్‌ లెవల్స్‌కి వెళ్లా’’ అని తెలిపింది ఈ మెగాస్టార్ ముద్దుల కూతురు .