మరో రీమేక్ కి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్?

Pawan Kalyan green signal for another remake?

0
128

ఈ ​ఏడాది ‘వకీల్​సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్​స్టార్ పవన్​కల్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ రెండు సినిమాలు రీమేక్​లే కావడం విశేషం. ఇప్పుడు మరో రీమేక్​కు పవన్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.

తెలుగులో విలన్ పాత్రలతో పాపులారిటీని పెంచుకుంటున్న సముద్రఖని, తమిళంలో మంచి దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల అక్కడ వచ్చిన ‘వినోదియ సిత్తం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను సముద్రఖని చూపించడంతో, ఆయన దర్శకత్వంలో ఆ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ అంగీకరించారని అంటున్నారు. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

పరశురామ్​ ఓ కంపెనీలో 26 ఏళ్ల నుంచి పనిచేస్తుంటాడు. జనరల్​ మేనేజర్​ కావాలని చూస్తుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురైన మరణిస్తాడు. ఆ తర్వాత టైమ్​ అనే వ్యక్తి వచ్చి పరశురామ్​కు 90 రోజులపాటు బతికే అవకాశమిస్తాడు. తద్వారా అతడు ఏం తెలుసుకున్నాడు? ఆ 90 రోజుల్లో ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో తెలుగు-తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.