పాయల్ కి గంటకి లక్ష రూపాయలు

పాయల్ కి గంటకి లక్ష రూపాయలు

0
95

ఆర్ఎక్స్ 100 విడుదల తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరు టాలీవుడ్ లో ఎప్పుడు మార్మోగి పోతోంది. ఈ సినిమాలో ఘాటైన ముద్దు సీన్లలో నటించడం ద్వారా పాయల్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పక తప్పదు. ఆ సినిమా కి రెమ్యూనరేషన్ గా కేవలం రూ. 6 లక్షలు తీసుకున్నది. ఆమె పరిషోతకం గురించి పట్టించుకోకుండా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలనే కసితో ఆమె తెగింపుగా నటించింది. ఆ తెగింపే పాయల్‌కు వరుస అవకాశాలు తెచ్చి పెడుతోంది. దీంతో ఈ బ్యూటీ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది

ఈ మద్యే జరిగిన జీ తెలుగు కామెడీ అవార్డ్స్ వేడుకకు పాయల్‌ను కూడా ఇన్వైట్ చేశారు. ఈ అవార్డుల కార్యక్రమంలో పాయల్ స్టేజ్ అప్పియరెన్స్ ఇచ్చినందుకుగాను రూ. 5 లక్షలు చార్జ్ చేసిందని సమాచారం. ఏది ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కేవలం ఐదు నిమిషాల అప్పియరెన్స్ కోసం తన మొదటి సినిమా రెమ్యూనరేషన్‌తో సమానమైన మొత్తం తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

జీకామెడీ అవార్డ్స్ వేడుకకు లైట్ పింక్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే లుక్‌తో హాజరైన పాయల్… ఈ అవార్డుల వేడుకకే హైలెట్ అవ్వడంతో పాటు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమెతో పాటు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా హాజరయ్యారు. ఈ అమ్మడి డిమాండ్ చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మనకి దర్శనమిస్తుందని తెలుస్తుంది.