వరుణ్‌తేజ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీ ముకుంద చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె తన నటనతో కంటే స్కిన్ షోతోనే అవకాశాలు కొట్టేస్తోంది. ఇక గత ఏడాది అల్లు అర్జున్‌తో నటించిన దువ్వాడ జగన్నాథం హిట్ అవడంతో ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి.
ఈ నేపధ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ సరసన సాక్ష్యం చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. వీక్ టాక్ ప్రకారం చూస్తే దాదాపుగా బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది ఈ చిత్రం.
అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. సాక్ష్యం చిత్రంలో నటించడానికి మొదట పూజ ఒప్పుకోలేదట. అయితే ఆ చిత్ర యూనిట్‌లో కొంతమంది మాటలు విని ఒప్పుకుందట. అమ్మడికి పారితోషికం కూడా పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడంతో మొదట సంకోచించినా.. ఆ తర్వాత ఒప్పేసుకుందట. అయితే తీరా రిజల్ట్ చూస్తే ఈ చిత్రానికి నెగిటీవ్ టాక్ రావడంతో ఒక్కసారిగా షాక్ తిండట పూజ. దీంతో ఆ చిత్ర యూనిట్ తనను నమ్మించి మోసం చేసిందని.. పై గుర్రుగా ఉందట పూజ.