ప్రియుడికి గుడ్ బై చెప్పనున్న రష్మిక

ప్రియుడికి గుడ్ బై చెప్పనున్న రష్మిక

0
70

తెలుగు, కన్నడలో హీరోయిన్ రష్మిక మందన్న కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ‘కిర్రిక్ పార్టీ’తో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామకు ఇటు తెలుగు, అటు కన్నడలో చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్మిక తన ప్రియుడికి బ్రేకప్ చెప్పనున్నట్లు శాండిల్‌వుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

‘కిర్రిక్ పార్టీ’లో నటించినప్పుడు ఆ మూవీ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన రష్మిక.. ఆ తరువాత అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కొద్ది రోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే ఆ తరువాత ఇద్దరు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అవ్వడంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో రక్షిత్‌, రష్మిక మధ్య మనస్పర్థలు వచ్చినట్లు శాండిల్‌వుడ్‌లో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కెరీర్‌ మీదే దృష్టి పెట్టాలని అనుకుంటున్న రష్మిక త్వరలోనే ప్రియుడికి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలపై ఆ యువజోడి ఎలా స్పందింస్తుందో చూడాలి. కాగా విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ‘గీత గోవిందం’ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.