చి ల సౌ మూవీ రివ్యూ

చి ల సౌ మూవీ రివ్యూ

0
45

చిత్రం : చి ల సౌ
నటీనటులు : సుశాంత్ , రుహాణి శర్మ , వెన్నెల కిశోర్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : నాగార్జున అక్కినేని , జశ్వంత్ నడిపల్లి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫర్ : సుకుమార్. ఎం
ఎడిటర్ : చోటా కె ప్రసాద్

కథ –
అర్జున్ (సుశాంత్ ) కు పెళ్లి అంటే ఇష్టం ఉండదు . ఆయన తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా పెళ్లి చేయాలని ఒక రోజు వాళ్లింట్లోనే హీరోయిన్ అంజలి ( రుహాణి శర్మ ) తో పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో సుశాంత్ ఎలాగైనా అమ్మాయికి నో చెప్పి పంపించాలనుకుంటాడు పెళ్లి చూపులకు సుశాంత్ ఇంటికి వచ్చిన అంజలి కి కూడా పెళ్లి అంటే అస్సలు ఇష్టం ఉండదు కాని పెళ్లి చేసుకోకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయం తో ఒప్పుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది. అంజలి, అర్జున్ ల పెళ్లి జరిగిందా లేదా అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఇది మొదటి సినిమానే అయినా ఎంతో అనుభవం వున్నా డైరెక్టర్ లా ఈ కథను తెరకెక్కించాడు. ఒకే ఒక్క రాత్రిలో సినిమా ను డీల్ చేసిన విధానం బాగుంది. ఇక అర్జున్ పాత్రలో నటించిన సుశాంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. అంజలి పాత్రలో నటించిన రుహాణి కి ఇది మొదటి సినిమా అయినా అద్భుతంగా నటించింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు.

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథను ఎంచుకున్న దర్శకుడు రాహుల్ ఇంకొంచెం కమర్షియల్ అంశాలను జోడిస్తే అవుట్ ఫుట్ వేరేలా ఉండేది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను విసిగిస్తాయి. సినిమాకు బలంగా నిలిచినవెన్నెల కిషోర్ పాత్రను ఇంకొంచెం పొడిగించాల్సి ఉండేది. రెండవ భాగాన్నిబానే డీల్ చేసిన దర్శకుడు మొదటి భాగంలో పట్టు కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. హీరో హీరోల మధ్య సన్నివేశాలు ఇంకొంచెం బలంగా రాసుకోవాల్సింది.

చివరిగా – పరవాలేదు సింపుల్ స్టోరీ

రేటింగ్ – 3.0