ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

ఢిల్లీకి బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం పొందడం.. గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు, ఉమ్మడి హైకోర్టు విభజన సహా కేంద్రం ఇచ్చిన ఇతర హామీలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా వంటి అంశాలపైనా ఆయన వారితో చర్చించనున్నారు.

అలాగే స్థానికులకు విద్య, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానాన్ని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించగా.. దానిని ప్రధానికి వివరించి కేంద్ర ఆమోదం వచ్చేలా చేయనున్నారు.

1 COMMENT

Comments are closed.