మహేష్ బాబు 25 వ సినిమా ఫస్ట్ లుక్ ఆ రోజే

మహేష్ బాబు 25 వ సినిమా ఫస్ట్ లుక్ ఆ రోజే

0
57

ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీపైడిపల్లి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 25 వ సినిమా. 24 వ సినిమా భరత్ అనే నేను కొరటాల డైరెక్షన్ లో వచ్చి, టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.

ప్రస్తుతం చేస్తున్న 25 మూవీ లో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే మహేష్ తో తొలిసారిగా జతకట్టనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అశ్విని‌దత్, పివిపి లు సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల డెహ్రాడూన్‌లో పూర్తయింది.

అసలు విషయం ఏమిటంటే ఈ నెల 9 న మహేష్ బాబు పుట్టినరోజు. పుట్టిన రోజు కానుకగా 25 వ సినిమా నుండి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ని ఈ రోజు నుండి ప్రారంభించారు. పుట్టిన రోజు , అలాగే ఫస్ట్ లుక్ లతో మహేష్ బాబు తన అభిమానులకి గిఫ్ట్ ఇవ్వనున్నాడు.