బోయపాటి తో మరో సినిమా టార్గెట్ 2019 ఎలెక్షన్స్

బోయపాటి తో మరో సినిమా టార్గెట్ 2019 ఎలెక్షన్స్

0
21

బాలకృష్ణ ఎన్నికల వస్తున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ వేశాడు. గత 2014 ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలకృష్ణ…ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో లెజెండ్ సినిమా చేసి తన పొలిటికల్ జర్నీకి కొంత మైలేజ్ వచ్చేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో తిరిగి హిందూపురం నుంచే ఈసారి పోటీ చేయాలి అనుకొంటున్న బాలయ్య… గతంలో వేసిన ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన లెజండ్ సినిమా బాలకృష్ణ రాజకీయ కెరియర్ కి అలాగే టీడీపీ కి బాగా ఉపయోగపడింది.

అందులో బాలయ్య చెప్పే డైలాగ్స్ రాష్ట్రం అంతటా మరు మారుమోగిపోయాయి. నిన్ను అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకనివ్వను అనే డైలాగ్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటది. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా బాలకృష్ణ సరిగ్గా ఎన్నికల సమయానికి సింహ, లెజండ్ వంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ ని అందించిన డైరెక్టర్ బోయపాటితో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రత్యర్థులపై విమర్శలతో పాటుగా, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని ప్రచారం చేసేలా నిర్మించాలని అనుకుంటున్నట్టు సమాచారం.

ఈ సినిమాతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని అలాగే కేంద్ర ప్రతిపక్ష పార్టీలు పెట్టిన ఇబ్బందులను ఎలా ఎదుర్కొందో ప్రతిదీ సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో తీయాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ టీడీపీ వ్యవస్థాపకుడు తన తండ్రి ఎన్టీరామారావు జీవితచరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ గా తీస్తూ ఆ సినిమాలో రామారావుగారి పాత్రను పోషిస్తున్నాడు.