మహాభారతంలో ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసా ?

మహాభారతంలో ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసా ?

0
111

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు . ఇప్పటికే పలు అవకాశాలు రాగా వాటిని ఏమాత్రం మొహమాటం లేకుండా తోసిపుచ్చిన ప్రభాస్ తాజాగా అమీర్ ఖాన్ రూపొందించబోయే ” మహాభారతం ” చిత్రంలో మాత్రం అర్జునుడిగా నటించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది . ఆమేరకు అమీర్ ఖాన్ ప్రభాస్ ని సంప్రదించినట్లు , అందుకు సూత్రప్రాయంగా ప్రభాస్ అంగీకరించినట్లు తెలుస్తోంది . బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్ కు మహాభారతం సరైన సినిమా అవుతుందని అలాగే అర్జునుడి పాత్ర పోషించడం ద్వారా తన సత్తా చాటే ఛాన్స్ లభిస్తుందని అంటున్నారు .

అమీర్ ఖాన్ ఎప్పటినుండో మహాభారతం చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించాలని చూస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో శ్రీ కృష్ణుడి గా అమీర్ ఖాన్ నటించనున్నాడు . వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో మహాభారతం నిర్మించాలని అప్పట్లో ప్లాన్ చేసాడు కానీ మళ్ళీ మధ్యలో దాని ఊసే లేకుండా పోవడంతో అమీర్ సైలెంట్ అయ్యాడని వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మహాభారతం చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు . అమితాబ్ భీష్ముడిగా , దీపికా పదుకోన్ ని ద్రౌపదిగా నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .