ప్రొ హాకీ​ లీగ్​: తొలిసారి భారత మహిళల జట్టు

0
82

ఎఫ్​ఐహెచ్​ ప్రొ హాకీ లీగ్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది భారత మహిళల జట్టు. కొవిడ్‌ కారణంగా తమ దేశాల్లో అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు ఉండడం వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఈ లీగ్‌ నుంచి వైదొలిగాయి. దీంతో భారత్‌, స్పెయిన్‌కు ఈ అవకాశం దక్కింది. దీనితో ప్రొ హాకీ​ లీగ్​లో తొలిసారి భారత మహిళల జట్టు పాల్గొననుంది.

ఈ ఏడాది ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌ సీజన్‌-3లో భారత్‌, స్పెయిన్‌ ఆడబోతున్నాయి. వచ్చే సీజన్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తిరిగి ఆడతాయి” అని ప్రపంచ హాకీ సమాఖ్య వెల్లడించింది. ఇప్పటికే భారత్‌, స్పెయిన్‌ పురుషుల జట్లు కూడా హాకీ ప్రొ లీగ్ లో పోటీపడుతున్నాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌, స్పెయిన్‌ మహిళల జట్లు అద్భుతంగా ఆడాయి. రాణి రాంపాల్‌ సారథ్యంలోని భారత్‌.. ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చి తొలిసారి సెమీఫైనల్‌ చేరగా..స్పెయిన్‌ త్రుటిలో సెమీస్‌ బెర్తు చేజార్చుకుంది.