త్వరలో ప్రో కబడ్డీ లీగ్..వివరాలివే

0
122

చాలా త‌క్కువ స‌మ‌యంలోనే దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించింది ప్రొ క‌బ‌డ్డీ లీగ్. క్రికెట్ మేనియాలో ఉన్న భార‌త అభిమానుల‌కు ఓ కొత్త అనుభూతిని పంచింది ఈ లీగ్. అలాంటి ప్రొ క‌బ‌డ్డీ లీగ్ 8వ సీజ‌న్ డిసెంబ‌ర్ 22 నుంచి మ‌ళ్లీ ఫ్యాన్స్‌ను అల‌రించ‌నున్న‌ట్లు ఈ లీగ్ ఆర్గ‌నైజ‌ర్ మాష‌ల్ స్పోర్ట్స్ తెలిపింది.

మొత్తం 59 ప్లేయ‌ర్స్‌ను ఆయా ఫ్రాంచైజీలు రిటేన్ చేసుకున్నాయి. 450 మంది ప్లేయ‌ర్స్ వేలంలో పాల్గొన్నారు. వీళ్ల‌లో 190 మంది ప్లేయ‌ర్స్‌ను టీమ్స్ కొనుగోలు చేశాయి. మొత్తం రూ.48.22 కోట్లు వెచ్చించారు.

అత్య‌ధికంగా స్టార్ ప్లేయ‌ర్ ప‌ర్‌దీప్ న‌ర్వాల్‌ను రూ.1.65 కోట్లు పెట్టి యూపీ యోధా సొంతం చేసుకుంది. ఇక మ‌రో స్టార్ సిద్దార్థ్ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్ టీమ్ రూ.1.3 కోట్ల రిటేన్ చేసుకుంది. పీకేఎల్ డిఫెండింగ్ చాంపియ‌న్స్‌గా బెంగాల్ వారియ‌ర్స్ ఉన్నారు.