వెళుతూ వెళుతూ పంజాబ్ ని తీసుకువెళ్లిన చెన్నై టీమ్

వెళుతూ వెళుతూ పంజాబ్ ని తీసుకువెళ్లిన చెన్నై టీమ్

0
106

ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఆశించిన పంజాబ్ జట్టు ఆశలు అడియాశలు అయ్యాయి, చివరకు చెన్నై వారి ఆశలపై నీరు చల్లింది…చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను ఓడించింది.
ఇక ధోనీ సేన ఎలాగో వెనక్కి వెళుతోంది, వారితో పాటు పంజాబ్ ని కూడా తీసుకువెళ్లింది.

ఈ మ్యాచ్ లో ఓటమితో పంజాబ్ జట్టు నాకౌట్ అవకాశాలకు తెరపడింది. ఓవరాల్ గా ఆ జట్టు ఐదోస్థానంలో నిలిచింది. అందరూ అనుకున్నారు టాస్ ఈ మ్యాచ్ ని డిసైడ్ చేస్తుంది అని , చెన్నై బ్యాట్స్ మెన్స్ ప్రతాపం చూపించారు మొత్తానికి ధోనీ సేన వెళుతూ వెళుతూ విజయంతో వెళ్లింది.

ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి విజయభేరి మోగించింది.
బ్యాటింగ్ తో చుక్కలు చూపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు కూడా అదే చేశాడు
49 బంతుల్లో 62 పరుగులు చేశాడు..డుప్లెసిస్ 34 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు.