TTD Updates : జూన్ 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

Pushpa Yagam at Ttd Sri Govindarajaswamy Temple on June 18

0
127

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్ర‌వారం పుష్పయాగం జ‌రుగ‌నుంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వ‌హిస్తారు.
జూన్ 18న ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు.

ఆల‌యంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.