రంగస్థలం సెంచరీ చేసిన సెంటర్లు ఇవే

రంగస్థలం సెంచరీ చేసిన సెంటర్లు ఇవే

0
114

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అందాల భామ సమంత హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు, ఆది పినిశెట్టి, నరేశ్, అనసూయ ప్రధాన పాత్రల్లో వచ్చిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ ధర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 100 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకుని ఇప్పటికీ కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది.

ప్రస్తుతమున్న రోజుల్లో ఒక సినిమా 100 రోజులు కాదు కదా. 50 రోజులు ఆడటమే ఎక్కువ. అలాంటి రంగస్థలం మొత్తం 15 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఆ 15 సెంటర్లు ఇవే.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హిందూపూర్, ఆదోని, విజయవాడ, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, గాజువాక, అనకాపల్లి, విజయనగరం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.

కాగా, చిత్ర యూనిట్ రంగస్థలం శతదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిన్న హైదరాబాద్ లో జరిపింది. హీరో రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్, రంగమ్మత్త అనసూయ, సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం ఘన విజయం సాధించడం పట్ల, శతదినోత్సవం పూర్తిచేసుకోవడంపై తమ సంతోషం వ్యక్తం చేశారు.