రఫేల్​దే టైటిల్..అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న రికార్డు

0
103

స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అదరగొట్టాడు. జకోవిచ్‌, రోజర్ ఫెదరర్‌లను కాదని టెన్నిస్‌ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌తో నాదల్‌ గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 21కి చేరింది. నేడు జరిగిన మ్యాచ్ లో ఆఖరి సెట్‌వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫేల్‌ నాదల్ విజయం సాధించాడు.