రోబో 2.0 టీజర్ కి ముహూర్తం ఫిక్స్

రోబో 2.0 టీజర్ కి ముహూర్తం ఫిక్స్

0
87

రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘2.O’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

కాగా రోబో సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ నటించగా.. అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీకి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతుండగా.. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.