టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా టీ20 సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
చాలా మంది దిగ్గజాలు కేఎల్ రాహుల్, రోహిత్ పేర్లు చెబుతున్నారు. మరికొంత మంది పంత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ పేసర్ అశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని ఓ పేసర్‌కు సారథి అయ్యే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. బుమ్రాను జట్టుకు కెప్టెన్ చేయాలని సూచించాడు.
మరో వారం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వనుంది. త్వరలోనే న్యూజిలాండ్‌తో 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో నెహ్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.