కేరళ ప్రజల కోసం తన బైక్ ని వేలం పాట వేస్తున్నట్లు ప్రకటించిన యంగ్ హీరో

కేరళ ప్రజల కోసం తన బైక్ ని వేలం పాట వేస్తున్నట్లు ప్రకటించిన యంగ్ హీరో

0
120

టాలీవుడ్ నూతన కథానాయకుడు కార్తికేయ నటించిన చిత్రం RX 100 . జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబట్టింది.అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కథానాయకుడు, కథానాయిక కలిసి యమహా RX 100 బైక్‌పై తిరుగుతారు. అయితే ఇప్పుడు కేరళ వరద బాధితుల కోసం ఈ బైక్‌ను వేలానికి ఉంచుతున్నట్లు కార్తికేయ ప్రకటించారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తామని తెలిపారు. వేలం రూ. 50 వేల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

వివరాలను rx100auction@gmail.comకు పంపాలని కోరారు. కేరళలో జరుగుతున్న పరిణామాల గురించి మనకు తెలుసు. మనలా సంతోషంగా ఉండే చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. తోటి రాష్ట్రంగా వారికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. ‘RX 100′ చిత్ర బృందం తరఫున బైక్‌ను వేలానికి ఉంచి, వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నాం అని వారు తెలిపారు .

హీరో కార్తికేయ మాట్లాడుతూ …నిజం చెప్పాలంటే.. నాకు జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువు ఆ బైక్‌. జీవితంలో ఎప్పుడూ వదులు కోకూడదు అనుకున్నా. కానీ వారికి జరిగిన నష్టం ముందు ఇది చాలా చిన్న విషయం. మా సినిమాను మీరు ఎంతో ఆదరించారు. అంతకు మించి మీరు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది’ అని కార్తికేయ చెప్పారు.