అక్క పెళ్ళిలో సందడి చేసిన సాయి పల్లవి

అక్క పెళ్ళిలో సందడి చేసిన సాయి పల్లవి

0
113
sai pallavi sister

తొలి తెలుగు చిత్రం ‘ఫిదా’తోనే ప్రేక్షకుల్ని మాయ చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఆ తర్వాత ఈ భామ ‘ఎంసీఏ’లో నాని సరసన మెరిశారు. ఈ బ్యూటీ మేకప్‌ పెద్దగా వేసుకోకుండానే కుర్రకారును ఆకట్టుకునేశారు. కాగా ఆమె తన సోదరి పూజా కన్నాతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తమ అభిమాన నటి చాలా బాగున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

సాయిపల్లవి, పూజ.. స్వాతి పెళ్లికి వెళ్లారు. అక్కడ ఇద్దరు పెళ్లి కుమార్తెతో కలిసి సంతోషంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను పూజ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. స్వాతి పెళ్లని తెలిపారు. మరి ఆమె వీరి స్నేహితురాలా, లేక బంధువా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

సాయిపల్లవి కథానాయికగా నటించిన చిత్రం ‘కణం’. నాగశౌర్య కథానాయకుడు. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించారు. మార్చి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయిపల్లవి ప్రస్తుతం సూర్య సరసన ‘ఎన్‌జీకే’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా ‘పడి పడి లేచె మనసు’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది.