మిడిల్ ఫింగర్ చూపెట్టి వార్నింగ్ ఇచ్చిన సమంత

మిడిల్ ఫింగర్ చూపెట్టి వార్నింగ్ ఇచ్చిన సమంత

0
133

హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను, తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది సమంత. తాజాగా సామ్ తన భర్త నాగచైతన్యతో కలసి స్పెయిన్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అక్కడ కురచ బట్టలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫొటో అసభ్యంగా ఉందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

ఓ పెళ్లైన మహిళ, అందులోనూ అక్కినేని వారింటి కోడలై ఉండి.. ఇటువంటి దుస్తులు ధరించడం ఏంటని ఫ్యాన్స్ సమంతపై ఫైర్ అయ్యారు. మరికొంత మంది శృతి మించి ట్రోల్స్ కూడా చేశారు. వీటన్నింటికి సమంత దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘నేను నా వైవాహిక జీవితం ఎలా బతకాలో చెబుతున్నామని అనుకుంటున్న మీ అందరికి’ అంటూ.. ఓ సిగ్నల్‌‌ని చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్టుగా పోస్ట్ చేసింది. ఈ చర్యని కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు మళ్లీ సమంతను టార్గెట్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది.