బార్-బార్ బాబా బోల్తా హై ఈ ట్రాక్ నేను రాయలేదు – సంజయ్‌దత్

బార్-బార్ బాబా బోల్తా హై ఈ ట్రాక్ నేను రాయలేదు - సంజయ్‌దత్

0
118

సంజయ్‌దత్ పేరు ఈ మధ్య వార్తల్లో తెగ వినపడుతుంది.కారణం వాటిలో ఒకటి ‘సంజూ’ సినిమాకాగా, రెండోది రామ్‌గోపాల్ వర్మ మళ్లీ సంజయ్‌దత్ సినిమా తీస్తాననడం, ఇక మూడవది తన సినిమా ..

సంజయ్‌దత్ నటించిన ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్-3’ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం సంజయ్‌దత్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా తరపున అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమివ్వకుండా మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మొదట్లో సావధానంగానే సమాధానాలు చెప్పిన ఆయన కొందరు రిపోర్టర్లు ‘బార్-బార్ బాబా బోల్తా హై’ పాటలో యాంటీ మీడియా ట్రాక్ గురించి అడగడంతో ఆగ్రహానికి గురయ్యారు.

తాను ఈ ట్రాక్ రాయలేదని చెప్పి ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కాగా ఈ విషయమై సినిమా పీఆర్ టీం పైనకూడా సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సంజయ్ ఇంటర్వ్యూలను తగ్గించుకుని, సెలెక్టెడ్ మీడియా పర్సన్స్‌కే ఇంటర్వ్యూ‌లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.రోజులో ఒక్కసారైనా సంజూ పేరు హాట్గా మారడం మరో విశేషం….